: ఆ ఒక్క సంఘటనే నా నిజజీవితంలో మిస్ అయింది!: నాగచైతన్య
తన రియల్ లైఫ్ లో ఎటువంటి సంఘటనలు ఉన్నాయో, ‘ప్రేమమ్’ చిత్రంలో కూడా అలాంటి సంఘటనలు ఉన్నాయని యువ నటుడు నాగచైతన్య పేర్కొన్నాడు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ప్రేమమ్’ చిత్రంలో స్కూల్, కాలేజీ, కెరీర్ లో సెటిల్ అయిన తర్వాత లవ్ గురించి ఉంటుందని చెప్పాడు. ఈ సినిమాలో కాలేజీలో చదువుకునే రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడే సీన్ ఉంటుందని అన్నాడు. ఆ ఒక్క సంఘటనే తన నిజజీవితంలో మిస్ అయిందని, మిగిలిన రెండు సంఘటనలు తన రియల్ లైఫ్ లో ఉన్నాయని చెబుతూ చిరునవ్వులు చిందించాడు. స్కూల్ రోజుల్లో అమ్మాయిల వెనక బాగానే పడేవాడినని, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తాను లవ్ లో పడిన విషయం తెలిసిందేనని నాగ చైతన్య చెప్పాడు.