: హేమమాలిని అడగటమే తరువాయి, రేఖ స్పందించింది!


అలనాటి అందాల తారలు, నేటి పార్లమెంట్ సభ్యులు హేమమాలిని, రేఖల మధ్య ఎంతో మంచి స్నేహ సంబంధాలున్నాయి. వారి స్నేహ బంధం గురించి, ఒకరిపై మరొకరికి ఎంత ఆప్యాయత ఉందని చెప్పడానికి ఈ సంఘటనను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్ లోని మధుర నియోజకవర్గానికి హేమమాలిని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గంలోని అత్యంత పురాతన కళాశాలల్లో ఒకటైన రామన్ గర్ల్స్ డిగ్రీ కాలేజీ అభివృద్ధి నిమిత్తం తోటి ఎంపీలు సహకరించాల్సిందిగా ఆమె కోరింది. దీనిపై వెంటనే స్పందించిన రాజ్యసభ సభ్యురాలు రేఖ రూ.35 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని చీఫ్ డెవలప్ మెంట్ అధికారి మనీష్ కుమార్ వర్మ తెలిపారు.

  • Loading...

More Telugu News