: బంకర్లలో తలదాచుకుంటున్న జమ్మూకాశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలు!


జమ్మూ కాశ్మీర్ లోని ఆఖ్నూర్, రాజౌరీ సెక్టార్ లోని గ్రామాలపై పాక్ సైనికులు అర్ధరాత్రి సమయంలో మోర్టార్ దాడులు, కాల్పులకు పాల్పడుతుండటంతో ఆయా గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. మోర్టార్ దాడుల కారణంగా సరిహద్దు గ్రామాల్లోని ఇళ్లు బాగా దెబ్బతింటున్నాయి. దీంతో, తమ ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని భయపడుతున్న అక్కడి ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. సరిహద్దుల్లో ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా ఎన్నాళ్లు ఉంటాయో అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News