: మందుపై ఉన్న విజన్ మంచినీటిపై లేదు... బాబుపై వాసిరెడ్డి ధ్వజం


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం షాపులను ఇష్టానుసారం విస్తరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యాన్ని నియంత్రించాల్సింది పోయి, మద్యం షాపులను పెంచుతాం, మద్యాన్ని ఏరులా పారిస్తాం అనే రీతిలో ముఖ్యమంత్రి ప్రకటన చేయడం ఎంతవరకు సమంజసం? అని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్నదానికన్నా ఎక్కువ మద్యాన్ని ఉత్పత్తి చేయాలనుకోవడం దారుణమైన నిర్ణయమని అన్నారు. ముఖ్యమంత్రికి మద్యంపై ఉన్న విజన్ మంచినీటిపై లేదని విమర్శించారు. నవ్యాంధ్రప్రదేశ్ ను మద్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారంటూ వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఖజానా నింపుకోవడమే చంద్రబాబు లక్ష్యమని విమర్శించారు. ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పుకుంటున్న చంద్రబాబు... డబ్బు కోసం మద్యాన్ని ఏరులై పారించడం ఎందుకని ప్రశ్నించారు. అవినీతిలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని పద్మ ఎద్దేవా చేశారు. మద్యం వ్యాపారుల నుంచి టీడీపీ నేతలు ప్రతి నెలా ముడుపులు తీసుకుంటున్న విషయం చంద్రబాబుకు తెలియదా? అని ఆమె నిలదీశారు.

  • Loading...

More Telugu News