: రాయ‌ల‌సీమ‌కు రూ.50 వేల కోట్ల ప్యాకేజీ ప్ర‌క‌టించాలి.. తిరుపతిలో వామప‌క్షాల దీక్ష


విభ‌జ‌న త‌రువాత ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొంటున్న రాయ‌ల‌సీమ ప్రాంతంపై కేంద్ర‌, రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు దృష్టిపెట్టాల‌ని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద వామ‌ప‌క్షాల నేత‌లు ఈరోజు దీక్ష‌కు దిగారు. రాయ‌ల‌సీమ‌కు రూ.50 వేల కోట్ల ప్యాకేజీ ప్ర‌క‌టించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చట్టంలో పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని అన్నారు. కేంద్రం ఇస్తామ‌ని చెబుతోన్న‌ జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్ల ముష్టిని తాము అంగీక‌రించ‌బోమ‌ని వ్యాఖ్యానించారు. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రకు చెరో రూ.50 వేల కోట్లు ఇవ్వాల్సిందేన‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News