: ఈ రోజు 'డేట్' చాలా ప్రత్యేకమైనది... ఒకసారి చూడండి!
ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. అలా అని, ఈ రోజు ఏ పండగ లేదు కదా అనుకోకండి. గూగుల్ లో ఈ రోజు ప్రత్యేకత ఏంటని అడిగితే... నేషనల్ నూడుల్ డే, నేషనల్ పోయిట్రీ డే అంటూ ఏవేవో కనిపిస్తాయి. అవి కూడా కాదు. ఆ ప్రత్యేకత ఏమిటంటే, ఈ రోజు డేట్ ను ఓ సారి గమనించండి. 6-10-2016 (6102016) ఈ రోజు డేట్ ముందు నుంచి చూసినా, వెనుక నుంచి చూసినా ఒకేలా కనిపించడం ఈ రోజు డేట్ ప్రత్యేకత. దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో కొన్ని కథలు, కథనాలు కూడా ఈ డేట్ చుట్టూ పరిభ్రమించడం విశేషం.