: డియర్ ప్రైమ్ మినిస్టర్...ఐ యామ్ వెరీ యాంగ్రీ!: ఐదేళ్ల బ్రిటన్ బాలిక ఆగ్రహం
ఐదేళ్ల చిన్నారి బ్రిటన్ ప్రధానిని ఆగ్రహంతో ప్రశ్నించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లండన్ కు చెందిన బ్రూక్ బ్లెయిర్ (5) సోషల్ మీడియాలో ఆ దేశ ప్రధానిని నిలదీసిన వీడియో అక్కడి మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. దీంతో బ్రూక్ బ్లెయిర్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. ఆ వీడియోలో ఆమె చెప్పింది ఆమె మాటల్లోనే..."నా పేరు బ్రూక్ బ్లెయిర్...నాకు ఐదేళ్లు...ప్రధాని థ్రేసా మే, మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్న రాత్రి వీధుల్లో వెళ్తుంటే.. వందలమంది ఇళ్లులేని అభాగ్యులను చూశాను. వాళ్ల కనీస అవసరాలు కూడా తీరడం లేదు...థ్రేసా మే...మీరు వాళ్లికి బిస్కెట్లు, చాక్లెట్లు, శాండ్ విచెస్ ఇవ్వాలి, ఇల్లు కట్టాలి...చూడండి...నాకు కేవలం ఐదేళ్లు..నేను వాళ్లకి ఏమీ చేయలేకపోతున్నాను. నేను వాళ్లకి సరిపడా డబ్బులు దాయలేదు...నేను దాచుకున్న డబ్బులు వారికి సరిపోవు. మీ దగ్గర డబ్బులున్నాయి. కొంత ఖర్చుచేయండి...వాళ్లకి సహాయం చేయండి...మీరలా చేయడం లేదు. మీరు చేయాల్సింది అదే...దేశంలో చాలా యుధ్ధాలు వచ్చాయి. వాటికోసం ఎంతో డబ్బులు ఖర్చుచేస్తున్నారు. మందు వీరికి సాయం చెయ్యిండి..థ్రేసా మే...చాలా కోపంగా ఉన్నాను". అంటూ ముగించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అక్టోబర్ 5న పోస్టు చేయగా తొలి రోజు యూట్యూబ్ లో 17,000 మంది చూశారు. ఫేస్ బుక్ లో దీనిని 90,000 మంది చూశారు. దీంతో మీడియాలో కూడా ఇది ప్రముఖంగా ప్రసారమైంది.