: దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి మృతి
గుంటూరు జిల్లా దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత గుదిబండ వెంకటరెడ్డి మృతి చెందారు. అనారోగ్యంతో గుంటూరులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. దుగ్గిరాల నియోజకవర్గం నుంచి వెంకటరెడ్డి నాలుగురు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దుగ్గిరాల నియోజకవర్గం రద్దయింది.