: రాష్ట్రీయ రైఫిల్స్ పై తెగబడ్డ ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం


జమ్మూకశ్మీర్ లో రాష్ట్రీయ రైఫిల్స్ ఆర్మీ క్యాంప్ లక్ష్యంగా ఉగ్రదాడికి పథకం రచించిన ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. కశ్మీర్ లోని హంద్వారాలో చొరబడ్డ ఉగ్రవాదులు రాష్ట్రీయ రైఫిల్స్ ఆర్మీ క్యాంప్ పై కాల్పులు ప్రారంభించారు. హఠాత్తుగా కాల్పులు ప్రారంభం కావడంతో సైన్యం వేగంగా స్పందించింది. ఊహించనంత వేగంగా సైనికుల స్పందనను చూసిన ఉగ్రవాదులు వెనుదిరిగారు. సురక్షితంగా వెళ్లిపోదామని భావించి, అడవుల్లోకి దూరాలని ప్రయత్నించారు. అయితే లాంగ్ గేట్ వద్ద వారిని అడ్డుకోగలిగిన జవాన్లు వారిని మట్టుబెట్టారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల శరీరాలను సైనికుల బుల్లెట్లు ఛిద్రం చేశాయి.

  • Loading...

More Telugu News