: నల్గొండ జిల్లాలో బస్సును ఢీ కొన్న లారీ... 20 మందికి గాయాలు
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నకేతపల్లి మండలం చీకటిగూడెం గ్రామం దగ్గర ఏపీ ఎస్ఆర్టీసీ బస్సును ఓ లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ బస్సు హైదరాబాదు నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, బస్సులోని 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు, వేగంగా స్పందించి క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. బస్సు, లారీ ధ్వంసమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.