: ఈరోజు, ఎందుకో, చాలా మాట్లాడాలని ఉంది: కల్యాణ్ రామ్
ఈరోజు తనకు ఎందుకో చాలా మాట్లాడాలని ఉందని ప్రముఖ నటుడు నందమూరి కల్యాణ్ రామ్ అన్నాడు. ‘ఇజమ్’ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ఎప్పుడు షూటింగుకి వెళిపోదామా అనిపిస్తుండేదని, అంత ఉత్సాహం తమకు రావడానికి కారణం దర్శకుడు పూరీ జగన్నాథ్ అని అన్నాడు. ఈ చిత్రం కోసం ప్రతిఒక్కరం చాలా ఉత్సాహంగా చేశామని అన్నాడు. ఆ ఉత్సాహం ఎలా ఉందంటే, పూరీ జగన్నాథ్ తో మళ్లీ ఇంకో సినిమా చేయాలనేంతగా ఉందని కల్యాణ్ రామ్ అన్నాడు.