: నా ఇద్దరు కొడుకులు 'హిట్స్' రూపంలో నాకు బహుమతులు ఇస్తున్నారు: నందమూరి హరికృష్ణ
తన ఇద్దరు కొడుకులు సినిమాల హిట్స్ రూపంలో తనకు బహమతులు ఇస్తున్నారని నందమూరి హరికృష్ణ అన్నారు. ‘ఇజమ్’ ఆడియో వేడుకలో మాట్లాడుతూ, తనకు 59 సంవత్సరాల వయసు వున్నప్పుడు కల్యాణ్ రామ్ ‘పటాసు’, జూనియర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ చిత్రాలు హిట్ అయ్యాయని, ఆ రూపంలో తనకు బహుమతిగా ఇచ్చారని అన్నారు. ఇక, తాను 60వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ చిత్రం హిట్ అవడం ద్వారా మరో బహుమతి లభించిందని, ఇప్పుడు ‘ఇజమ్’ చిత్రం హిట్ కాబోతుందని, కల్యాణ్ రామ్ ఇచ్చే మరో హిట్ ద్వారా ఇంకో బహుమతి తనకు లభించనుందంటూ హరికృష్ణ నవ్వుతూ చెప్పారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ హిట్ చిత్రాలను అందించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఈ సందర్భంగా ఆయన తన తండ్రి ఎన్టీఆర్ ను, తన పెద్ద కొడుకును గుర్తు చేసుకున్నారు.