: ‘పాక్’లో మ్యాచ్ లు ఆడకూడదంటూ తీసుకున్న నిర్ణయం సబబే: పుల్లెల గోపీచంద్
ఈ నెల 18 నుంచి 21 వ తేదీ వరకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరగనున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అంతర్జాతీయ సిరీస్ లో పాల్గొనకూడదంటూ భారత్ తీసుకున్న నిర్ణయం సబబేనని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను తప్పక సమర్థిస్తానని చెప్పారు. భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు అఖిలేష్ ఆలోచనకు తాము మద్దతు ఇస్తున్నామని అన్నారు. కాగా, అంతకుముందు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా ఈ టోర్నీ గురించి మాట్లాడుతూ, ఇస్లామాబాద్ లో జరగనున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సిరీస్ లో భారత క్రీడాకారులు పాల్గొనడం లేదని ప్రకటించారు.