: ఇంద్రకీలాద్రిలో క్యూలైన్ల ఏర్పాటుపై మండిపడ్డ భక్తులు


దసరా శ‌ర‌న్న‌వ‌రాత్రుల సందర్భంగా ఈరోజు కాత్యాయనీ దేవి రూపంలో దర్శనం ఇస్తున్న విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా తరలివచ్చారు. అయితే, అమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్‌లపై భక్తులు మండిపడ్డారు. అక్కడి సౌకర్యాల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అధికారులు భక్తుల సౌకర్యార్థం మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్‌లు ఏర్పాటు చేశారు. అయితే, క్యూలైన్ల మధ్యలో అత్యవసర మార్గాలు లేవు. క్యూ లైన్లలో ఉన్న సమయంలో భక్తులు అస్వస్థతకు గురైతే వారిని అక్కడి నుంచి తరలించడానికి, వైద్యం అందించడానికి కష్టంగా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం క్యూలైన్లలో భక్తుల మధ్య స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఓ వృద్ధురాలు అక్కడే పడిపోయింది. వైద్యం నిమిత్తం ఆమెను బయటికి తీసుకురావడానికి నానా కష్టాలు పడ్డారు.

  • Loading...

More Telugu News