: గురుదాస్ పూర్లో అనుమానితుల సంచారం
భారత్, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల్లో భారత జవాన్లు 24 గంటలూ అలర్ట్గా ఉంటున్నారు. కొద్ది సేపటకి క్రితం పంజాబ్లోని గురుదాస్ పూర్లో అనుమానితుల సంచారం జరిగినట్లు అక్కడి భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం అదే ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబాటుకి ప్రయత్నించారు. భారత బలగాలు వారిపై ఎదురుదాడి చేసిన విషయం తెలిసిందే.