: కేజ్రీవాల్, చిదంబరంలపై బీజేపీ నేత సంచలన కామెంట్స్


పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై సర్జికల్ దాడుల వీడియోలను బయట పెట్టాలని డిమాండ్ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు పీ చిదంబరం, సంజయ్ నిరుపమ్ లపై మధ్యప్రదేశ్ బీజేపీ నేత దిగజారుడు కామెంట్లు చేశారు. "ఆర్మీ జవాన్ల వీరత్వానికి సంబంధించిన ప్రశ్నలడుగుతున్నవారు, తల్లిదంద్రుల తొలిరాత్రి వీడియోను చూసిన తర్వాతే, వారికే పుట్టామని నమ్మే రకం" అంటూ విమర్శించారు. దేశం కోసం భారత ఆర్మీ రక్తం చిందిస్తుంటే, వారిపై నమ్మకం లేని వారు జాతి ద్రోహులేనని, వారంతా పాకిస్థానీ ఏజంట్లని, నవాజ్ షరీఫ్ అభిప్రాయం వీరి నోటీ వెంట వస్తోందని నిప్పులు చెరిగారు. ఇక ఇదే సమయంలో అక్కడే ఉన్న బీజేపీ ఎంపీ అలోక్ సంజార్, మరో అడుగు ముందుకేసి, సర్జికల్ దాడులు నిజమేనా? అని ప్రశ్నిస్తున్న వారు, ముందు తన తండ్రి గురించి తల్లిని అడిగి రావాలని అన్నారు. కాగా, దాడులకు చెందిన వీడియో బయటకు విడుదల చేసే విషయంలో నేటి సాయంత్రంలోగా ఓ నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News