: రూ. 396కే జెట్ ఎయిర్ వేస్ టికెట్... 7 వరకూ అమ్మకాలు


ఎయిర్ ఆసియా, స్పైస్ జెట్, ఇండిగో మొదలు పెట్టిన విమాన టికెట్ల ఆఫర్ సేల్ పోటీలో జెట్ ఎయిర్ వేస్ దిగింది. దేశవాళీ రూట్లలో రూ. 396కే టికెట్లు విక్రయిస్తామని తెలిపింది. తొలుత వచ్చిన వారికి తొలుత ప్రాతిపదికన టికెట్ల విక్రయాలు ఉంటాయని, బేస్ ఫేర్ కు అదనంగా ఫ్యూయల్ సర్ చార్జ్, పన్నులు చెల్లించాల్సి వుంటుందని వివరించింది. అక్టోబర్ 7వ తేదీలోగా వీటిని బుక్ చేసుకుని నవంబర్ 8 తరువాత ప్రయాణ తేదీని ఎంచుకోవాలని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా స్పైస్ జెట్ రూ. 888కి, ఎయిర్ ఆసియా రూ. 999కి ఆఫర్ టికెట్ అమ్మకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News