: డ్రగ్ రాకెట్ లో ఎయిర్ ఫోర్సు అధికారి అరెస్టు


హైదరాబాదులో కలకలం రేపుతున్న డ్రగ్స్ రాకెట్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. సైంటిస్ట్ వెంకటరమణ హైదరాబాదు శివార్లలో మూతబడ్డ కంపెనీని లీజుకి తీసుకుని, వందల కేజీల డ్రగ్స్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకటరమణ ఇంటి నుంచి 30 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ డ్రగ్ పై లోతైన దర్యాప్తు చేపడుతున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖరరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో వింగ్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖరరెడ్డిని నాందేడ్ లో అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు, హైదరాబాదుకు తరలించారు. సైంటిస్ట్ వెంకటరమణతో కలిసి రాజశేఖరరెడ్డి డ్రగ్ రాకెట్ నడిపినట్టు గుర్తించారు.

  • Loading...

More Telugu News