: భారత్ పై దాడులను ఎందుకు ఖండించరు?: పాకిస్థాన్ నటులను ప్రశ్నించిన జావెద్ అక్తర్!
బాలీవుడ్ లో కొందరు పాకిస్థాన్ నటీనటులను వెనకేసుకువస్తున్న సమయంలో ప్రముఖ గేయ రచయిత జావెద్ అక్తర్ వారిని నిలదీశారు. జమ్మూకశ్మీర్ లోని యూరీ సెక్టార్ లో భారతసైన్యంపై జరిగిన ఉగ్రవాద దాడిని పాకిస్థాన్ కి చెందిన బాలీవుడ్ నటులు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. వారెందుకు మౌనం వహిస్తున్నారో తనకు తెలియడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాక్ నటులు తమ మౌనం ద్వారా పాకిస్థానే యూరీ సెక్టార్ దాడులకు కారణమనే భావనను వారు కలిగిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. దీనిపై పాక్ నటులు స్పందిస్తే మంచిది, అలా కాకుండా పాకిస్థానే రంగంలోకి దిగి ఆ దాడులకు, తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తే మరీ మంచిదని ఆయన సూచించారు. పాకిస్థాన్ కి సంబంధించిన నటీనటులు ఆ దాడులను ఖండించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ఆయన నిలదీశారు.