: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి ధన్యవాదాలు చెప్పిన 'జాగ్వార్' టీం
'జాగ్వార్' సినిమాకు అన్నీ చక్కగా కుదిరాయని వెండితెరకు పరిచయమవుతున్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ తెలిపాడు. 'జాగ్వార్' ప్రమోషన్ లో మాట్లాడుతూ, తమ సినిమాకు ప్రత్యేకమైన లైటింగ్ విధానం ప్రవేశపెట్టామని, అలాగే ఇన్ఫోసిస్ క్యాంపస్ లో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా 'జాగ్వార్' అని అన్నాడు. చివరి సినిమా కూడా ఇదే అవుతుందని అభిప్రాయపడ్డ నిఖిల్, ఇలాంటి చాలా విశేషాలు ఉన్నాయని చెప్పాడు. సినిమా చూస్తే మరిన్ని సరికొత్త అనుభూతులు సొంతమవుతాయని తెలిపాడు. మంచి కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, సినీ పరిశ్రమలో ఇప్పుడే కళ్లు తెరుస్తున్న తనను ఆశీర్వదించాలని కోరాడు.