: జగన్ కు కరవు అంటే ఏంటో తెలుసా?: ఏపీ మంత్రులు చినరాజప్ప, ప్రత్తిపాటి


వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు కరవు అంటే ఏంటో తెలుసా? అని మంత్రులు చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. విజయవాడలో వారిద్దరూ మాట్లాడుతూ, రాయలసీమను రతనాల సీమగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, జగన్ మాత్రం కరవు సీమగా ఉండాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. జగన్ అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు తెలిపారు. ప్రభుత్వం అనంతపురం రైతులకు అండగా నిలుస్తుందని వారు భరోసా ఇచ్చారు. కేవలం అనంతపురం జిల్లాలోనే ఇన్ పుట్ సబ్సిడీగా 550 కోట్ల రూపాయలు ఇచ్చామని వారు వెల్లడించారు. జగన్ తమతో కలిసి పర్యటనకు వస్తే ఆ వివరాలు చూపిస్తామని వారు సూచించారు.

  • Loading...

More Telugu News