: పొలార్డ్ ను తీసెయ్యమని చెబుతున్న వకార్ యూనిస్


వెస్టీండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ ను జట్టు నుంచి తీసెయ్యాలని పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు వకార్ యూనస్ వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో వన్డేలో చివరి ఓవర్ లో విజయానికి 12 పరుగులు చేయాల్సిన దశలో పొలార్డ్ అలసత్వం ప్రదర్శించాడని మండిపడ్డాడు. పొలార్డ్ కెరీర్ లో అతను ఇలా ఆడడాన్ని తానెప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నాడు. టీ20 స్పెషలిస్టు అయిన పొలార్డ్ ఓవర్ లో 12 పరుగులు సాధించడం ఏనాడూ కష్టంగా ఫీలవ్వడం చూడలేదని, వన్డేలో విజయానికి అవసరమైన పరుగులు సాధించడంలో అలసత్వం ప్రదర్శించిన ఆటగాడిని క్షమించి వదిలెయ్యకూడదని ఆయన సూచించాడు. ఈ ఓవర్ లో కేవలం ఒక ఫోర్ మాత్రమే కొట్టాడని అన్నాడు. చివరి వన్డే నుంచి పొలార్డ్ కు ఉద్వాసన పలకాలని ఆయన పేర్కొన్నాడు. తనలాగే విండీస్ సెలక్షన్ కమిటీ కూడా భావిస్తుందని అనుకుంటున్నట్టు వకార్ యూనిస్ తెలిపాడు.

  • Loading...

More Telugu News