: హైదరాబాద్‌లో ముద్రగడ అధ్యక్షతన కాపు ముఖ్య నేతల భేటీ
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉద్యమిస్తోన్న కాపు ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం మరో పోరాటానికి దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తోన్న ఆయన.. తమ డిమాండ్లను నెరవేర్చుకునే క్రమంలో ముందుకు వెళ్లాల్సిన ప్రణాళికపై పలువురు కాపు నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ముద్రగడ అధ్యక్షతన కాపు ముఖ్యనేతలు మరోసారి సమావేశమయ్యారు. అందులో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు, వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డితో పాటు ఇతర నేతలు కూడా ఉన్నారు.