: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయిన 300 మంది మావోయిస్టులు


మావోయిస్టుల‌ ప్ర‌భావిత‌ ప్రాంతమైన ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఈరోజు మధ్యాహ్నం భారీ ఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బ‌స్త‌ర్ ఐజీ, సుకుమా, కొండ‌గామ్ ఎస్పీల ఎదుట మొత్తం 300 మంది మావోయిస్టులు స్వ‌చ్ఛందంగా లొంగిపోయారు. వారిలో 15 మంది మావోయిస్టులు త‌మ వ‌ద్ద ఉన్న‌ ఆయుధాలు స‌హా తమ ముందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల‌ ప్ర‌భావిత‌ ప్రాంతాల్లో పోలీసులు చేపడుతోన్న కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి.

  • Loading...

More Telugu News