: కలసి చదువుకున్న మిత్రుడికి కీలక పదవిచ్చిన చంద్రబాబు


తన చిన్ననాటి మిత్రుడు, పదో తరగతి నుంచి పరిచయమున్న ప్రొఫెసర్ జయరాంరెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు కీలక పదవిని ఇచ్చారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా జయరాంరెడ్డిని నియమించగా, ఆయన, సతీసమేతంగా చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో జయరాంరెడ్డి హైదరాబాదు, బంజారాహిల్స్ టీడీపీ ఆఫీసులో ఇన్ఫర్మేషన్ సెంటర్ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తిరుపతిలో చంద్రబాబుతో పాటే ఆయన ఒకే పాఠశాలలో చదువుకున్నారు. వారి స్నేహం కొనసాగుతూ రాగా, దానికి గుర్తుగా జయరాంరెడ్డికి కీలక పదవి లభించింది.

  • Loading...

More Telugu News