: సిరియాలో పెళ్లి వేడుకలోకి దూసుకువచ్చిన ఉగ్రవాది.. ఆత్మాహుతి దాడి.. 30 మంది మృతి
సిరియాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ పెళ్లి వేడుకకు వచ్చిన జనాన్ని టార్గెట్ చేసుకుని ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు. ఈ ఘటనలో 30 మంది పౌరులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 90 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. హసాక, కామిష్లి అనే రెండు ప్రాంతాల మధ్య ఉన్న రహదారి పక్కనే ఓ ఫంక్షన్ హాల్ ఉంది. అందులో ఓ కుర్దిష్ పెళ్లి వేడుక జరుగుతోంది. ఇంతలో ఒక్కసారిగా అందులోకి దూసుకొచ్చిన ఓ ఉగ్రవాది ఈ దాడికి పాల్పడ్డాడు. ఘటనకు పాల్పడింది తామే అంటూ ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు.