: నారాయణపేట జిల్లా కోసం రాజీనామాకు రెడీ అంటున్న రాజేందర్ రెడ్డి


అందరికీ పండగ పూట సంతోషాన్ని కలిగించేలా మరో నాలుగు జిల్లాలను కలిపి మొత్తం 31 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించినప్పటికీ, నిరసన సెగలు చల్లారలేదు. నారాయణపేట కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయనందుకు నిరసనగా ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ టికెట్ పై గెలిచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన రాజేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. తక్షణం నారాయణపేట జిల్లాను కొత్త జిల్లాల జాబితాలో చేర్చకుంటే, నేడు లేదా రేపు కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కాగా, ఉన్న 10 జిల్లాలకు తోడు మరో 17 జిల్లాలను ప్రాథమిక దశలో, ఆపై మరో 4 జిల్లాలను మలివిడతలోనూ కేసీఆర్ సర్కారు జిల్లాల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News