: సర్జికల్ స్ట్రయిక్స్‌కు ముందు మన జవాన్లు ఏం చేశారో తెలుసా?


పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో భారత జవాన్లు సర్జికల్ స్ట్రయిక్స్‌తో విరుచుకుపడి ఉగ్రమూకలను తుదముట్టించిన సంగతి తెలిసిందే. కఠినమైన ఈ ఆపరేషన్‌లో పాల్గొనడానికి ముందు భారత సైనికులు ఏం చేశారో తెలుసా? ఆపరేషన్‌కు ముందు పీవోకేలో అక్కడి దర్గాలో ప్రార్థనలు జరిపారు. 6 బీహార్, 10 డోగ్రా యూనిట్ల జవాన్లు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ దర్గా భారత సరిహద్దులో నవ్‌కోట్, చని గ్రామాల మధ్య ఉంది. 1971 యుద్ధం తర్వాత ఇక్కడి గ్రామాల ప్రజలు వలస వెళ్లిపోయారు. దీంతో ఈ దర్గాను పట్టించుకునేవారే కరువయ్యారు. తొలుత భారత సైనికులు కూడా ఈ దర్గా పాకిస్థాన్‌కు చెందినదే అని భావించారట. కానీ ఓ పశువుల కాపరి అందులో చిక్కుకుని ఆర్తనాదాలు చేయడంతో అతడిని రక్షించి ఆ దర్గా బాధ్యతలు అతడికి అప్పగించారు. తాజాగా పాక్ ముష్కరమూకలపై విరుచుకుపడడానికి ముందు జవాన్లు ఈ దర్గాలోనే ప్రార్థనలు నిర్వహించి ఆపరేషన్‌ను ప్రారంభించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News