: అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు.. చంద్రబాబు
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రోజే అమరావతి నుంచి పాలన ప్రారంభించడం సంతోషంగా ఉందని బాబు పేర్కొన్నారు. తిరుమలతోపాటు తిరుపతి అభివృద్ధి బాధ్యత కూడా టీటీడీదేనని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు తిరుపతిని ముస్తాబు చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.