: చంద్రబాబుగారూ! ఈ 12న మీరు తప్పకుండా రావాలి: బండారు దత్తాత్రేయ ఆహ్వానం
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. హైదరాబాదులోని లేక్ వ్యూ అతిథిగృహంలో బాబును కలిసిన దత్తన్న ఈ నెల 12న నిర్వహించనున్న అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాబుకు పుష్పగుఛ్ఛం ఇచ్చి దుశ్శాలువ కప్పి సత్కరించారు. దత్తాత్రేయ ఆహ్వానాన్ని చంద్రబాబు మన్నించినట్టు తెలుస్తోంది. కాగా, బండారు దత్తాత్రేయ ప్రతి సంవత్సరం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆయన ఆహ్వానిస్తారు. అందులో భాగంగానే ఏపీ సీఎంను ఆయన ఆహ్వానించారు.