: సీఎం జయలలితకు నేనంటే ఎంతో అభిమానం: చంద్రబాబు


తమిళనాడు సీఎం జయలలితకు తానంటే ఎంతో అభిమానం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీటీడీపీ నేతల భేటీలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆయన ప్రస్తావిస్తూ, ఆమె ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లో భారత సైన్యం జరిపిన నిర్దేశిత దాడుల గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఈ దాడులతో ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ బాగా పెరిగిందని అన్నారు.

  • Loading...

More Telugu News