: క్రీడాకారులకు నగదు ఇస్తున్నారు.. కానీ, అమరులైన సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం లేదు: సినీనటుడు మోహన్‌బాబు
ఇటీవల యూరీలోకి చొరబడ్డ పాక్ ఉగ్రవాదులు అక్కడి భారత సైనిక స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలబడకపోవడం బాధాకరమని సినీనటుడు మోహన్‌బాబు ట్విటర్ లో పేర్కొన్నారు. భారత క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి నగదు ప్రదానం చేసిన వారు, ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం లేదని విచారం వ్యక్తం చేశారు. పీవోకేలో భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్‌పై ఆయన స్పందిస్తూ మనదేశ నిజమైన హీరోలకు సెల్యూట్ అని పేర్కొన్నారు. సైనికులకు మనం ఎంతో రుణపడి ఉన్నామని అన్నారు. జై జవాన్ అని పేర్కొన్నారు. పట్టుదల ఉన్న ప్రధాని మనకు ఉండటం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.