: నూజివీడు ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత


కృష్ణా జిల్లా నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే ఎంవీ అప్పారావు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నూజివీడు ఎమ్మెల్యే అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ముద్రబోయిన వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు. దీంతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే అప్పారావు బయల్దేరారు. ఇది తెలుసుకున్న పోలీసులు ఆయనను గృహనిర్బంధం విధించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులకు ఎదురెళ్లి, ఎమ్మెల్యే ఇంటి తలుపులు పగులగొట్టి, ఆయనను బయటకు తీసుకొచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News