: జయలలితకు చికిత్స అందించి, చెన్నై నుంచి స్వ‌దేశానికి బయ‌లుదేరిన లండ‌న్ వైద్యుడు


అనారోగ్యంతో బాధపడుతూ గ‌త నెల 22న‌ చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చేరిన త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందించ‌డానికి నాలుగు రోజుల క్రితం లండన్ నుంచి స్పెషలిస్టు వైద్యుడు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. లండన్‌కు చెందిన కన్సల్టెంట్‌ ఇంటెన్సివిస్ట్‌ డా.రిచర్డ్‌ జాన్‌ బేలే నేతృత్వంలోని వైద్యుల బృందం జ‌య‌ల‌లిత‌కు పరీక్ష‌లు నిర్వహించి, చికిత్స‌ అందించింది. అయితే, ‘అమ్మ’ ఆరోగ్యం కుదుట‌ప‌డ‌డంతో లండ‌న్ వైద్యుడు కొద్దిసేప‌టి క్రితం స్వ‌దేశానికి బ‌య‌లుదేరారు. ముఖ్య‌మంత్రి ఆరోగ్య ప‌రిస్థితిని అపోలో ఆసుప‌త్రి వైద్యులు నిరంత‌రం స‌మీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News