: జిల్లాగా జనగామ..? కరీంనగర్ నేతలతో చర్చల తరువాత వరంగల్ నేతలతో కేసీఆర్ భేటీ
కరీంనగర్ జిల్లా నేతలతో చర్చించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయడానికి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వరంగల్ జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. జనగామను జిల్లాగా చేయడంపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనంతరం ఆ ప్రాంతాన్ని జిల్లాగా చేసే అంశంపై కేసీఆర్ నుంచి స్పష్టత రానుంది. ఆ తరువాత ఆయన మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జిల్లాలోని గద్వాల ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని యోచిస్తోన్న విషయం తెలిసిందే. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటుపైనే ఈరోజంతా కేసీఆర్ చర్చిస్తున్నారు. జనగామ, గద్వాలను కూడా జిల్లాలుగా చెయ్యాలని నిర్ణయిస్తే ప్రస్తుతమున్న పది జిల్లాలకు అదనంగా 20 కొత్త జిల్లాల ఏర్పాటు ఈ దసరా నుంచే ప్రారంభం కానున్నాయి.