: ఒకే ప్లేస్ లో ఒకే రకమైన పచ్చబొట్టు పొడిపించుకున్న చైతూ, సమంత... మీరూ చూడండి!
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ గా మారనున్న అక్కినేని నాగ చైతన్య, సమంతలు తమ కుడి చేయి మణికట్టుపై ఒకే రకమైన పచ్చబొట్టు పొడిపించుకున్నారు. వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట గురించి బయటకు వచ్చే ప్రతి వార్తా అత్యంత ఆసక్తిని కలిగిస్తూనే ఉంది. ఇక ఈ ట్యాటూ అర్థం ఏంటని చైతూని ప్రశ్నిస్తే, ఇది రోమన్ సింబల్స్ లో ఒక అక్షరమని, ఎవరి రియాలిటీని వాళ్లే క్రియేట్ చేసుకోవాలన్న భావముందని చెప్పుకొచ్చాడు. ఇక అనుకోని వీరు ఒకే సింబల్ ను వేయించుకున్నారో లేక.. ఇద్దరికీ రాసిపెట్టడంతోనే ఇలా సింబల్ సింక్ అయ్యిందోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.