: ఎవరో అలిగారనో, అడిగారనో జిల్లాల సంఖ్యను పెంచకూడదు: కిష‌న్‌రెడ్డి


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ‌పై బీజేపీ రాష్ట్ర నేత, ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డి స్పందించారు. ఈరోజు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... ఎవరో అలిగారనో, అడిగారనో కొత్త‌ జిల్లాల సంఖ్యను పెంచకూడ‌ద‌ని ఆయ‌న సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగాలని అన్నారు. కాగా, కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి విడుద‌ల చేస్తోన్న నిధుల వినియోగంపై తెలంగాణ‌ ప్రజలకు వాస్తవాలు తెలిసేలా రాష్ట్ర స‌ర్కారు ఒక వివర‌ణ ఇవ్వాల‌ని ఆయ‌న అన్నారు. నిధులను తెలంగాణ‌ స‌ర్కారు దారి మళ్లిస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News