: కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ ఫలితం.. ఢిల్లీ సర్కారుకు సుప్రీంకోర్టు జరిమానా
ఢిల్లీలో విజృంభిస్తోన్న డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులపై కేజ్రీవాల్ సర్కారు చూపిస్తోన్న తీరు దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ఆగ్రహం తెప్పించింది. ఢిల్లీ సర్కారు కనబరుస్తోన్న నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇటీవలే ఈ అంశంపై తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా నిర్లక్ష్యం చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు గానూ ఢిల్లీ ప్రభుత్వానికి రూ.25 వేల జరిమాన విధిస్తున్నట్లు తాజాగా పేర్కొంది.