: ఈడెన్ టెస్టులో వృద్ధిమాన్ సాహా అరుదైన రికార్డు
న్యూజిలాండ్‌తో ఈడెన్‌లో జరుగుతోన్న టెస్టు మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సాహా (మొదటి ఇన్నింగ్స్ 54 నాటౌట్, రెండో ఇన్సింగ్స్ 58 నాటౌట్) హాఫ్ సెంచరీలు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రికార్డును సాధించాడు. ఒకే టెస్ట్ మ్యాచులో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన నాల్గో వికెట్ కీపర్ గా సాహా ఘనత సాధించాడు. ఐదు సంవత్సరాల అనంతరం ఒక టీమిండియా వికెట్ కీపర్ ఈ రికార్డు సాధించడం ఇదే మొదటిసారి. టీమిండియా మాజీ వికెట్ కీపర్లలో ఎమ్మెస్ ధోని, దిల్వార్ హుస్సేన్, ఫరూఖ్ ఇంజనీర్ల సరసన సాహా నిలిచారు. ఈ ఘనతను ధోని గతంలో నాలుగు సార్లు అందుకున్నారు. 2008లో మొహాలిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో, అనంతరం అదే సిరీస్ లో నాగ్ పూర్ లో జరిగిన టెస్టులో, 2009లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచులో, ఆ తరువాత రెండేళ్లకి బర్మింగ్ హమ్లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులోనూ ధోనీ ఈ రికార్డును నెలకొల్పాడు.