: తెలంగాణలో 'ఆరోగ్య శ్రీ'కి అడ్డంకులు... పేదల గగ్గోలు!


తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, 200 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలందించేందుకు హాస్పిటల్ యాజమాన్యాలు నిరాకరించాయి. దీంతో నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోగా, రోగులు, ముఖ్యంగా పేదలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన వైద్య సేవలకు సంబంధించి రూ. 490 కోట్ల మేరకు బకాయిలు అందాల్సి వుంది. దీర్ఘకాలంలో ఈ మొత్తం పెండింగ్ లోనే ఉండిపోవడంతో గతంలోనూ ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల మధ్య చర్చలు సాగిన సంగతి తెలిసిందే. వీరికి బకాయిలు చెల్లించడంలో కేసీఆర్ సర్కారు విఫలం కాగా, మరోసారి వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఆసుపత్రులు ప్రకటించాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News