: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ల కలకలం
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఈరోజు ఉదయం ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా సోదాలు చేస్తోన్న సిబ్బందికి ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు కనిపించటం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి లక్నో వెళ్లడానికి వచ్చిన సదరు ప్రయాణికుడి లగేజిని తనిఖీ చేస్తున్న సిబ్బందికి అందులో మూడు బుల్లెట్లు ఉన్నట్లు తెలిసింది. దీంతో సిబ్బంది ఆ వ్యక్తిని విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు.