: చెన్నై ఆపోలో ఆసుపత్రికి హుటాహుటిన పన్నీర్ సెల్వం... శశికళతో మంతనాలు!


గత రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నా, ఆమె గురించిన సరైన సమాచారం చెప్పడం లేదని అభిమానులు ఆందోళనకు దిగుతున్న వేళ, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ ఉదయం ఆసుపత్రికి వచ్చారు. జయలలిత ఆసుపత్రిలో ఉండడంతో, పాలనా బాధ్యతలను పరోక్షంగా చేపట్టిన ఆయన, మరో ఇద్దరు మంత్రులతో కలసి హడావుడిగా లోపలికి వెళ్లడం కనిపించింది. ఆసుపత్రిలో జయలలిత నిచ్చెలి శశికళతో పన్నీర్ సెల్వం ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. జయలలిత చికిత్స పొందుతున్న వార్డులోకి శశికళ మినహా మరెవరికీ ప్రవేశం కల్పించడం లేదు. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుడు రిచర్డ్ నేతృత్వంలో ఆమెకు చికిత్స కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడతారని ఏఐఏడీఎంకే వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News