: కాఫీ పెట్టుకోవచ్చు, ఇంకా సరదా పడితే బిర్యానీ చేసుకుని పండగ చేసుకోవచ్చు: చంద్రబాబు


రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికీ 15 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ తీసుకురానున్నామని, ఫైబర్ నెట్ ద్వారా రూ.150 కే అన్ని ఛానెళ్లు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని, వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకునే అవకాశం కల్పిస్తామని, మూడు టెలిఫోన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో ‘చంద్రన్న బీమా’ పథకం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘సాంకేతికతను విరివిగా ఉపయోగించుకోవాలి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా పేదలకు, రైతులకు, విద్యార్థులకు న్యాయం చేయవచ్చు, మెరుగైన సేవలందించవచ్చు. అందుకే, నేను మొదటి నుంచి టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులోకి వస్తే, మీ పిల్లలతో గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. డ్వాక్రా ఆడబిడ్డలు పనుల నిమిత్తం బయటకు వెళితే మగవాళ్లు బాధపడనక్కర్లేదు. టీవీ చూసి కాఫీ పెట్టుకోవచ్చు, ఇంకా సరదా పడితే, బిర్యానీ కూడా తయారు చేసుకుని పండగ చేసుకోవచ్చు’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News