: ఇబ్రహీంపట్నంలో మళ్లీ పేలుడు..ముగ్గురికి గాయాలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిన్న రాత్రి సంభవించిన భారీ పేలుడు మరవకముందే మళ్లీ మరో సంఘటన జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం చౌరస్తాలో మరోసారి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కాళిదాసు, మల్లమ్మ, యాదయ్య అనే ముగ్గురు గాయపడ్డారు. భారీ పేలుడు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వరుస పేలుళ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు.