: చంద్రబాబు ఎస్కార్ట్ లో ఒక వాహనం దారి తప్పింది!


తిరుపతిలో ఏర్పాటు చేసిన ఓడీఎఫ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తుండగా ఆయన ఎస్కార్ట్ లోని ఒక వాహనం దారి తప్పిన సంఘటన ఈరోజు జరిగింది. చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో, వెంటనే అధికారులు అప్రమత్తమవడంతో దారి తప్పిన వాహనం వెనక్కి వచ్చింది. కాగా, ట్రాఫిక్ స్తంభించడంతో తిరుచానూరు వంతెన వద్ద కొద్దిసేపు సీఎం కాన్వాయ్ నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News