: దుర్గగుడి లడ్డూలో పురుగులు..భక్తుల ఆగ్రహం


విజయవాడ దుర్గ గుడి లడ్డూ ప్రసాదం తయారీలో నిర్లక్ష్యం బయటపడింది. ప్రసాదం లడ్డూలలో పురుగులు దర్శనవిువ్వడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతగోడౌన్ లోని లడ్డూ తయారీ పోటు పురుగులమయంగా మారింది. గోడౌన్ సీలింగ్ భాగంలో లెక్కకు మించిన పురుగులు ఉన్నాయి. సీలింగ్ ను శుభ్రం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, దసరా నవరాత్రుళ్లు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అమ్మవారి ప్రసాదమైన లడ్డూలను అధిక సంఖ్యలో తయారు చేస్తున్నారు. అయితే, ఈ ప్రసాదం పురుగులతో నిండి ఉండటం పలు విమర్శలకు దారితీస్తోంది.

  • Loading...

More Telugu News