: రాఫెల్ యుద్ధ విమానాలను త్వరగా పంపాలని కోరాం: రక్షణ మంత్రి


ఫ్రాన్స్ నుంచి అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు ముందుగానే భారత్ కు రానున్నాయి. ఒప్పందం ప్రకారం యుద్ధ విమానాలను 36 నెలల్లోపు డెలివరీ చేయాలని, కానీ ఇవి అంతకంటే ముందే రానున్నాయని, వీలైనంత ముందుగా అందించాలని కోరినట్టు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. పాకిస్తాన్ తో ఘర్షణాత్మక వాతావరణం నేపథ్యంలో రాఫెల్ యుద్ధ విమానాలను ముందుగా అందించాలని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెల 23న రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై భారత్, ఫ్రాన్స్ సంతకాలు చేశాయి. వీటి విలువ రూ.59వేల కోట్లు. ఈ విమానాలు క్షిపణులను మోసుకెళ్లే అత్యాధునిక యుద్ధ విమానాలు.

  • Loading...

More Telugu News