: తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 112 పరుగుల ఆధిక్యం
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 112 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 316 పరుగులు చేసిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్సింగ్స్ లో శనివారం ఏడు వికెట్ల నష్టానికి 128 పరుగులు వరకు చేయగా... ఆదివారం తిరిగి ఆట ప్రారంభమైన తర్వాత మరో 76 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మొత్తం 204 పరుగులకు న్యూజిలాండ్ జట్టును భారత బౌలర్లు కట్టడి చేసేశారు. ఏడు వికెట్లు కోల్పోయిన దశలో జీతన్ పటేల్ (47), వాట్లింగ్ (25) కుదురుగా ఆడి ఈ మాత్రమైనా స్కోర్ సాధించేందుకు సహకారం అందించారు. భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు తీసుకుని కీలక పాత్ర పోషించాడు.