: గాంధీ చూపిన మార్గంలో పయనిద్దాం: ప్రధాని మోదీ


జాతిపిత మహాత్మాగాంధీ 147వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి అర్పించారు. గాంధీ సిద్ధాంతాలు, పేదలపట్ల ఆయన చూపించిన అంకిత భావం, అన్యాయంపై ఆయన చేసిన పోరాటం మనకు స్ఫూర్తిదాయకం అని ప్రధాని కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ ఇతర ప్రముఖులు ఈ రోజు ఢిల్లీలోని గాంధీ సమాధి రాజ్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సీనియర్ బీజేపీ నేత అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత గులాంనబీ అజాద్ తదితరులు కూడా నివాళులు అర్పించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని మతాల ప్రార్థనలను రాజ్ ఘాట్ వద్ద ఏర్పాటు చేశారు. అలాగే దేశవ్యాప్తంగా జయంతి కార్యక్రమాలు జరగనున్నాయి. గాంధీ సిద్ధాంతాలైన అహింస, స్వేచ్ఛ, మత సామరస్యం ఎల్లప్పుడూ అనుసరించతగిన విలువలుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సందేశంలో పేర్కొన్నారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఇదే రోజు కావడంతో ప్రధాని సహా ప్రముఖులందరూ నివాళులు అర్పించారు. శాస్త్రి స్మారక కేంద్రం వద్ద ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.

  • Loading...

More Telugu News