: ద్వారకాతిరుమలలో విషాదం.. లారీ లోంచి రేకులు జారిపడి ఇద్దరు ప్రయాణికుల మృతి


పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం గున్నంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రేకుల లోడ్‌తో వెళ్తున్న లారీలో ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. లారీలో ఉన్న రేకులు ప్రమాదవశాత్తు ప్రయాణికులపై పడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రేకులు కింద ఇరుక్కుపోయిన ప్రయాణికులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News